NDL: బనగానపల్లె పట్టణంలోని మౌలాలి స్వామి కాలనీలో ఇవాళ ఇంటింటికి సీపీఐ పార్టీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శివయ్య, ఎర్రి స్వామి నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు వారు ఇంటింటికి వెళ్లి సీపీఐ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు.
ఏలూరు: నూజివీడులో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ప్రత్యేక ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పట్టణ సీఐ పి. సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ల ఆదేశంతో మెడికల్ క్యాంపు నిర్వహించామన్నారు. మహిళల సంరక్షణ ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు.
CTR: కుప్పం RTC డిపో నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ శుక్రవారం పరిశీలించారు. గుట్టపల్లి, కమతమూరు సమీపంలో 15.37 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు. ఇప్పటికే ఈ స్థలాన్ని రీ సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో JC పరిశీలించారు. త్వరలో మోడల్ డిపో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.
VZM: డెంకాడ మండలం పెదతాడివాడలో శుక్రవారం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు కిలారి ఎల్లారావు, కోరాడ రఘు పొలాల్లో వేసిన నువ్వుల ఈ-పంట నమోదును పరిశీలించారు. అనంతరం ఈ-పంటను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యాచరణలో భాగంగా శుక్రవారం చిట్యాల మండలం, వట్టిమర్తి గ్రామ పంచాయతీలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీపీ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. సర్పంచ్ మేడి శ్రీలత, ఉపసర్పంచ్ బెల్లి భవాని, కార్యదర్శి పరమేష్, వార్డు సభ్యులు అనంతరెడ్డి, మేడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
TG: చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేషన్ కార్డు ఉంటే రేషన్ బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వానికి మాదిగలు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా.. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశామన్నారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని గచ్చుబావి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ సత్యం బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
TG: ఎస్సీల వర్గీకరణ కోసం వారి వెంటే నడిచానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బలహీనవర్గాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పారు. కర్ణుడు తన చివరి శ్వాస వరకు మిత్ర ధర్మాన్ని పాటించాడని.. అలాగే తాను కూడా మాదిగల వెంట ఉంటానని ఉద్ఘాటించారు. ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలు చూస్తునే ఉన్నానని అన్నారు.
TPT: తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నారాయణవనం మండలం జంగాలపల్లి, ఎరకంబట్టు గ్రామాల్లో బయోఫోర్టిఫైడ్ మొక్కజొన్న పంట ప్రదర్శనా క్షేత్రాలు నిర్వహించారు. పూసా HQPM-5 రకం మొక్కజొన్న రైతులు సాగు చేసే సాధారణ రకాలతో పోలిస్తే మంచి దిగుబడి ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు, 53 మంది రైతులు పాల్గొన్నారు.
MLG: జిల్లా ఏటూరునాగారం పట్టణానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ ఇటీవల గ్రూప్-1లో 105వ ర్యాంక్ సాధించి DSPగా ఎంపికయ్యాడు. అయితే నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణను పారిశుద్ధ్య కార్మికురాలైన నానమ్మ పెంచింది. ప్రవీణ్ విజయంపై స్థానికులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP: తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తల్లికి వందనం కింద 67 లక్షల మందికి రూ.8,454 కోట్ల సాయం అందించామన్నారు. అర్హులందరికీ సాయం అందజేస్తామని, ఎవరికైనా అందకపోతే వివరాలు ఇస్తే సరిచేస్తామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
NZB: బాల్కొండ మండలం చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఓ రేకుల షెడ్డు కింద మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వయసు 50-60 ఏళ్లు, 5 అడుగులు ఎత్తు ఉందని ఎస్సై శైలేందర్ శుక్రవారం తెలిపారు. మృతురాలి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎవరికైనా సమాచారం తెలిస్తే 8712659860 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.
E.G: 2026 టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జిల్లాలోని 138 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఒకే సెషన్లో పరీక్షలు జరుగుతాయన్నారు. రెగ్యులర్ అభ్యర్థులు 13,322 మంది, ప్రైవేట్ అభ్యర్థులు 11,216 మంది ఉన్నారన్నారు.
NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లిలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 6 నుంచి 10వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని బుడుమ వారి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు కోరారు.
GDWL: ధరూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇవాళ గ్రామపంచాయతీ పాలకవర్గం అలాగే పంచాయతీ కార్యదర్శులతో 99 రోజుల ప్రజా పాలన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన పారిశుద్ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, బోర్ వెల్స్ పునరుద్వర్ధన, ఘన పదార్థాలను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థ పరిశుభ్రత, చేపట్టాల్సిన అంశాలపై ప్రణాళిక సిద్ధం చేశారు.