MHBD: కొత్తగూడ మండలం ఎంచగూడలో శ్రీ కోమ్మలమ్మ జాతరను ఆలూరి, వాసం, అలెం వంశీయులు పూజారుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతుంది. మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచన మేరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కుంజ కుసుమాంజలి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
NZB: నిజామాబాద్ పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను శుక్రవారం టీఎన్జీవో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పట్టణంలోని ఓ ప్రైవేటు కార్పొరేట్ స్మాల్ ఫైనాన్స్ సంస్థ శాఖలో ఉద్యోగి, ఉన్నతాధికారులతో కలిసి రుణాల పేరిట భారీ మోసం చేశారు. తక్కువ విలువ ఆస్తులపై అధిక శాతం రుణాలు మంజూరు చేసి కమీషన్లు తీసుకున్నట్లు సమాచారం. సంస్థకు చెందిన వరంగల్ శాఖలో 271 రుణ ఖాతాల్లో మొత్తం రూ.94.16 కోట్లలో దాదాపు రూ.70 కోట్లు సంస్థకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.
MDK: రామాయంపేట మున్సిపాలిటీలో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు మోతుకు చంద్రమౌళి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చంద్రమౌళి విద్యార్థులకు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన కుటుంబానికి అన్ని వేళలా తోడుగా ఉంటామని పద్మాదేవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.
కర్నూలు: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామ వైసీపీ నాయకులు చిన్న వీరేష్, యోహాను, చాకలి పెద్ద నారాయణ, ఉసేని, ఇస్సాక్ శుక్రవారం పోలీసు స్టేషన్‌లో కొత్త ఎస్ఐ మారుతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ మారుతికి శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. చిన్నతుంబళం గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల జీవన పరిస్థితులను వివరించారు. శాంతిభద్రతలకు సహకారించాలని ఎస్ఐ కోరారు.
కడప: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB తనిఖీల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవనాలు సర్టిఫికెట్లు జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. జనరల్ విభాగంలో 126 మందికి 121 మంది, ఒకేషనల్ విభాగంలో 100 మందికి 96 మంది హాజరయ్యారు. మొత్తం 9 మంది విద్యార్థులు పరీక్షకు రాలేదని అధికారులు తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
కొందరు మట్టి, కాగితం లేదా సుద్ద వంటివి తింటుంటారు. ఈ వింత కోరికను ‘పికా’ అనే రుగ్మతగా వైద్యులు చెబుతారు. శరీరంలో ఐరన్ లోపం వల్లనే ఇలాంటి అలవాటు ఏర్పడుతుందని, ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని అంటున్నారు. అలాగే, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
యంగ్ హీరో శివ కందుకూరి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నవాబ్ కేఫ్’. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ‘ఈటీవీ విన్’లో మార్చి 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామాను రవికాంత్ జెట్టి దర్శకత్వం వహించగా, ఆర్.ఎమ్. ప్రొడక్షన్స్ నిర్మించింది.
NGKL: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కల్వకుర్తి మండలం తోటపల్లిలో సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి లింగం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది రోడ్లను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో ఉన్న ఆయుధాలు వాటి వినియోగం గురించి వివరించారు. అలాగే లాకప్ రూమ్, రికార్డుల నిర్వహణ, పోక్సో చట్టం, తదితర అంశాలపై సీఐ అప్పన్న విద్యార్థులకు అవగాహన కల్పించారు.
RR: గ్రామ అభివృద్ధే తన లక్ష్యం అని మొయినాబాద్ మండలం మోతుకుపల్లి గ్రామ సర్పంచ్ సంపూర్ణ రాములు అన్నారు. ఇవాళ గ్రామంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు. ఐదు సంవత్సరాలలో మరెన్నో అభివృద్ధి పనులు చేసి గ్రామ రూపురేకలు మారుస్తానని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
GDWL: మల్దకల్ మండల పరిధిలోని మద్దెలబండ, చిన్న తండా పరిసరాల్లో గత రెండు రోజులుగా పులి సంచరిస్తుందని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఊరగట్టు పిల్లగుంట్ల ప్రాంతంలో ఒక గేదె, ఆవు దూడపై పులి దాడి చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున దూడపై దాడి చేసిందని తెలిపారు.
VZM: కండ్లకలకను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డా కె.త్రినాథరావు సూచించారు. కండ్లకలక, ఇతర కంటి వ్యాధులు సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కళ్ళు ఎర్రబారడం, దురద లేదా నీరు కారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాలన్నారు.
కర్నూలు: కోరువ సంఘం పెద్దల ఆహ్వానం మేరకు మండల కేంద్రమైన కౌతాళంలోని శివప్ప నగర్‌లో ఎరుకల కుల దైవం కోరువ అంజమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ శుక్రవారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉరుకుంద ఈరన్న మాజీ ట్రస్ట్ ఛైర్మన్ చెన్న బసప్పను కోరువ సంఘం పెద్దలు శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో మంజునాథ, ఉమేశ్ గౌడ్, సిద్దు, చంద్రశేఖర్, పాల్గొన్నారు.