• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే, మేయర్

MBNR: జిల్లాలో నూతన కలెక్టర్‌గా కుష్బూ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ మమత కలెక్టర్ కార్యాలయంలో కుష్బూ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

March 6, 2026 / 02:20 PM IST

కరెంట్ షాక్‌తో ఉద్యోగి మృతి..!

CTR: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన గుడిపల్లె సబ్ స్టేషన్‌‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప(43) కాంట్రాక్ట్ ఉద్యోగిగా సబ్ స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం సబ్ స్టేషన్‌లో విద్యుత్ షిఫ్ట్ మార్చే క్రమంలో షాక్ తగిలి చనిపోయాడు.

March 6, 2026 / 02:20 PM IST

అల్వాల్‌లో బెల్ట్ షాపులపై దాడులు

MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ బెల్ట్ షాపులపై అల్వాల్ పోలీసులు దాడులు నిర్వహించారు. వెంకటాపురం హరిజన బస్తీ, హస్మత్ పేటలో ఎస్సై గీతా అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో సోంకర్ కోమల, మాయ షాపులో దాదాపు రూ.30 వేల విలువైన 200 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

March 6, 2026 / 02:20 PM IST

అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య కమిటీ

SRCL: ఇల్లంతకుంట మండలంలోని రేపాక అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య కమిటీ తల్లుల నూతన కమిటీని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా రేపాక సర్పంచ్ కాత మల్లేశం, కన్వీనర్‌గా అంగన్వాడీ టీచర్ రమ నియమితులయ్యారు. సభ్యులుగా గ్రామ కార్యదర్శి ప్రవీణ్, వీవో ఛైర్మన్ రొండ్ల స్వరూప, ఏఎన్‌ఎం జయశ్రీతో పాటు పిల్లల తల్లులను చేర్చారు. ఉప సర్పంచ్ కొదని మహేష్, పిల్లల తల్లులు ఉన్నారు.

March 6, 2026 / 02:18 PM IST

భారత్ హ్యాట్రిక్ కొడుతుందా?

డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ ఆదివారం న్యూజిలాండ్‌తోT20 WC 2026 టైటిల్ పోరులో తలపడనుంది. రోహిత్ సారథ్యంలో T20 WC 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన టీమిండియా.. ఇప్పుడు సూర్య కెప్టెన్సీలో ఈ టోర్నీపై కన్నేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌పై గెలిస్తే.. 2013-2024 మధ్య ఒక్క ICC టైటిల్ కూడా గెలవలేకపోయిన భారత్‌కు ఇది హ్యాట్రిక్ ICC టైటిల్ అవుతుంది.

March 6, 2026 / 02:17 PM IST

పాఠశాలలో ఫుడ్ కమిషనర్ తనిఖీ

అన్నమయ్య: రామపురం మండలంలోని APSWRS, కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ విజయ్ ప్రతాప్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన వసతులపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 6, 2026 / 02:16 PM IST

251 మంది గైర్హాజరు..!

TPT: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో జనరల్ కోర్సులో 8,798 మందికి గాను 8,547 మంది హాజరుకాగా 251 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులో 1,082 మందికి గాను 1,050 మంది హాజరై 32 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.

March 6, 2026 / 02:15 PM IST

హెల్త్ క్యాంపుని ప్రారంభించిన ఎమ్మెల్యే

JN: 99 రోజులపాటు నిర్వహించే ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లింగాల ఘనపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే ప్రారంభించారు.

March 6, 2026 / 02:15 PM IST

‘ఇలా పరిసరాలలో చెత్తను ఉంచవద్దు’

MNCL: ఇళ్ల పరిసరాలలో చెత్తను, పనికిరాని వస్తువులను ఉంచవద్దని దండేపల్లి మండల అధికారులు సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దండేపల్లితో పాటు లింగాపూర్, తాళ్లపేట, మేదరిపేట, మామిడిపల్లి, లింగాపూర్, ద్వారక, గుడిరేవు, వెల్గనూర్ అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు.

March 6, 2026 / 02:13 PM IST

PHCలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన

ELR: ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు అన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుఖవ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

March 6, 2026 / 02:12 PM IST

‘సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతో సాకారం’

VKB: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. పాత కొడంగల్ తండాకు చెందిన చిన్ని బాయి గృహ ప్రవేశానికి ఆయన హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామాల్లో ఏళ్లుగా సొంతింటిని కట్టుకోవాలన్న కలను ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన అన్నారు.

March 6, 2026 / 02:12 PM IST

శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు 12 విమానాలు రద్దు

HYD: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 12 విమానాలు రద్దయ్యాయి. అదే సమయంలో గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన మరో 12 విమానాలు కూడా రద్దయ్యాయి. ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి రావాల్సిన, వెళ్లాల్సిన విమానాలు రద్దు అయ్యాయి.

March 6, 2026 / 02:12 PM IST

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

KRNL: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు.

March 6, 2026 / 02:12 PM IST

అభివృద్ధికి నిధులు కేటాయించండి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. శుక్రవారం అమరావతిలో పవన్ కళ్యాణ్‌ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.

March 6, 2026 / 02:11 PM IST

వచ్చే ఏడాది పోలవరం పూర్తి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. ‘ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపారు. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం’ అని సీఎం వెల్లడించారు.

March 6, 2026 / 02:10 PM IST