విజయనగరం మండలంలోని కేఎల్ పురం నుంచి ద్వారపూడి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. జిల్లా కేంద్రం నుంచి ఇటుగా నిత్యం రాకపోకలు సాగుతాయి. పలుచోట్ల భారీ మలుపులున్నాయి. హెచ్చరిక బోర్డులు గానీ, వీధి దీపాలు గానీ లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు
VKB: తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి దుర్వాసన రాకుండా రీసైక్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డును 99 డేస్ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఆయన పరిశీలించారు. పట్టణాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెత్త సేకరణ ప్రణాళికతో చేపట్టాలన్నారు.
SRCL: వేములవాడ శాత్రాజుపల్లికి చెందిన సెక్యూరిటీ గార్డ్ ప్రశాంత్ గుండెపోటుతో మృతి చెందారు. తిప్పాపూర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఆయన, రాత్రి అస్వస్థతకు గురికావడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. యువకుడైన ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
AKP: భవిష్యత్తులో వచ్చే తుఫానులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడుతూ.. 2014-19 మధ్య చంద్రబాబు 219 తుఫాన్ షెల్టర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. పైగా డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు.
SRPT: చివ్వేంల మండలంలోని ఉండ్రుగొండ గ్రామంలో సీసీ రోడ్డు పనులను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె రామకృష్ణ, మాజీ జెడ్పీటీసీ చింతమళ్ళ రమేష్, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి పాల్గొన్నారు.
కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆలమూరులోని బాలికొన్నత పాఠశాలలో శుక్రవారం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఆలమూరు మండల విద్యాశాఖ అధికారులు బి.అప్పాజీ, ఎన్.రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలమూరులో ఓ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు విద్యార్థినులకు దంత వ్యాధులు వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృ వందనం యోజన పథకాన్ని గర్భవతులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని పీహెచ్‌సీ వైద్యాధికారి షేక్ కరీముల్లా అన్నారు. ఈ సందర్భంగా కంచికచర్ల మండలంలోని కీసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీఎంఎంవీవై పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ASF: ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత జిల్లా అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రణాళికలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లోనే వేయాలని సూచించారు. అపరాధ రుసుము విధిస్తామనే భయం లేకపోవడంతో కొందరు చెత్తను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారని తెలిపారు.
ASF: ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత జిల్లా అధికారులకు సూచించారు. ప్రజా పాలన-ప్రణాళికలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త కుండీల్లోనే వేయాలని సూచించారు. అపరాధ రుసుము విధిస్తామనే భయం లేకపోవడంతో కొందరు చెత్తను ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారని తెలిపారు.
BHNG: మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య ఆధ్వర్యంలో పట్టణంలో ప్రత్యేక సానిటైజర్ డ్రైవ్ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న పారిశుద్ధ్య, ఇతర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
RR: మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లోని నీలిమా హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో సామాజిక సేవకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు మ్యూజికల్ ఛైర్స్, టగ్ ఆఫ్ వార్ వంటి వివిధ క్రీడలు నిర్వహించి, విజేతలకు రూ. 5,000, రూ. 3,000 విలువైన బహుమతులను అందజేశారు.
VSP: కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బంది క్రీడా పోటీలను బెలూన్‌లని ఎగరవేసి ప్రారంభించారు.
NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా శుక్రవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం గణితం 2, జంతు శాస్త్రం 2, చరిత్ర, 2 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 5677 మంది విద్యార్థులకు గాను 5534 మంది పరీక్ష రాశారని 143 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు.
MDK: రోడ్డు ప్రమాదంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్సై భౌతిక దాడికి పాల్పడ్డారని మెదక్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. కేసు పెట్టడానికి వెళ్లిన న్యాయవాదిపై దుర్భాషలాడి చెయ్యి చేసుకున్నారన్నారు. వెంటనే ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ కి బార్ అసోసియేషన్ సభ్యులు పిర్యాదు చేశారు.
E.G: రాజమండ్రి నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం కోటిలింగాలపేటలోని 10 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఆయన తనిఖీ చేశారు. నీటి శుద్ధి, క్లోరినేషన్ విధానాన్ని పరిశీలించి, ప్రతిరోజూ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.