• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన

ATP: రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు, నేర కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు తీసుకునే చర్యలు గురించి విద్యార్థులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్‌పై అవగాహన కల్పించారు.

March 6, 2026 / 08:00 PM IST

‘పారిశుద్ధ్య డ్రైవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’

KMM: గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం రైతువేదిక నందు మండల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులకు అవగాహన కల్పించారు.

March 6, 2026 / 08:00 PM IST

ఈనెల 8న ములుమూడి కలుజు‌పై బ్రిడ్జికి శంకుస్థాపన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ములుమూడి కలుజు‌పై బ్రిడ్జికి ఈనెల 8న ఉదయం 9:00 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేస్తారని తెలిపారు.

March 6, 2026 / 08:00 PM IST

ఏస్సైగా పదోన్నతి పొందిన నరసింహ రావు

E.G: కడియం హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీ.నరసింహ రావు ఏస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ వెంకటేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టేషన్ సిబ్బంది అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ఆయన 36 ఏళ్లుగా కానిస్టేబుల్‌గా, హెడ్ కానిస్టేబుల్‌గా పలు సేవలు అందించినట్లు సీఐ తెలిపారు.

March 6, 2026 / 08:00 PM IST

వేం నరేందర్ రెడ్డిని కలిసిన సమ్మి గౌడ్

MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో శుక్రవారం కేసముద్రం మండలానికి చెందిన నాయకుడు సమ్మి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వెళ్లడం మా ప్రాంతానికి గర్వకారణమని సమ్మి గౌడ్ అన్నారు.

March 6, 2026 / 08:00 PM IST

సబ్సిడీపై రైతులకు ఎరువులు: AO

WGL: నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడే, పీఎస్బీ (భాస్వరం కరిగించే ఎరువు)లను 50 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు AO రజిత తెలిపారు. ట్రైకోడెర్మా 1 కిలో ప్యాకెట్ పూర్తి ధర రూ.100 కాగా, సబ్సిడీ తర్వాత రైతులు రూ.50 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 6, 2026 / 08:00 PM IST

పాఠశాలలను సందర్శించిన డీఈవో నాగేశ్వరరావు

కాట్రేనికోన, చెయ్యరు జడ్పీ ఉన్నత పాఠశాలలను అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించి విద్యార్థులకు ఉన్న సామర్ధ్యాల గురించి వివరాలను తెలుసుకున్నారు. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులు పోటీ తత్వంతో చదవాలన్నారు.

March 6, 2026 / 08:00 PM IST

‘దళితుల ఐక్యతను దెబ్బతీయడానికి కుట్రలు’

SKLM: ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతను దెబ్బతీయటానికి అన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేశాయని ఇచ్చాపురం నియోజకవర్గ దళిత సంఘ నాయకులు దడ్డ చంద్రశేఖర్, బాగా మోహనరావులు తెలిపారు. ఇచ్చాపురంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడారు. అన్ని పార్టీలు మాల సామాజిక వర్గాన్ని దోపిడీదారులుగా చిత్రీకరించి దళిత ఐక్యతను దెబ్బతీస్తున్నారని వాపోయారు.

March 6, 2026 / 07:58 PM IST

మోదీ స్టేడియంలో ‘ఫైనల్’.. ఫ్యాన్స్‌లో టెన్షన్

T20 WC ఫైనల్ అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా జరగనుండటం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే, ఇదే స్టేడియంలో భారత్ 2023 ODI WC ఫైనల్లో ఓడింది. అలాగే, ప్రస్తుత T20 WC S-8 దశలో కూడా సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. గత 30 ICC మ్యాచ్‌ల్లో భారత్ ఓడిన 2 మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో కావడం గమనార్హం. మొత్తంగా ఈ స్టేడియంలో 10 మ్యాచ్‌లు ఆడితే.. 7W, 3L.

March 6, 2026 / 07:58 PM IST

ఆధార్ అప్‌డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్

PLD: చిలకలూరిపేటలోని BSNL కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్ పేరుతో అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సుబ్బయ్య తోట నివాసి నాయుడు శివ ఆరోపించారు. శుక్రవారం పేరు అప్‌డేట్ చేయించేందుకు వెళ్లగా,అక్కడి కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ నగదు అడిగారని ఆయన పేర్కొన్నారు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివ,వెంటనే బిఎస్ఎన్ఎల్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

March 6, 2026 / 07:55 PM IST

అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

NTR: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.

March 6, 2026 / 07:55 PM IST

చీపురు పట్టిన కలెక్టర్

NGKL: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను ఊడ్చారు. ’99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శుభ్రత డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచడంతో పాటు, పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 6, 2026 / 07:53 PM IST

యూనిక్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించిన ఎంపీడీవో

NTR: నందిగామ మండలం అంబర్‌పేట గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ప్రసాద్‌రావు యూ ఎఫ్ సర్వేను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సర్వే ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తుల నుంచి వచ్చిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.

March 6, 2026 / 07:52 PM IST

యుద్ధం.. రూ.31 వేల కోట్ల ఖర్చు

ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘జెయింట్ రేజ్’ సైనిక చర్య అత్యంత ఖరీదైనదిగా మారుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ఆపరేషన్, మొదటి 100 గంటల్లోనే సుమారు 3.71 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.31వేల కోట్లు) ఖర్చు అయిందట. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ అంచనా రిపోర్టు విడుదల చేసింది. మరోవైపు భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లిందని పేర్కొంది.

March 6, 2026 / 07:50 PM IST

బొత్స సత్యనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ప్రకాశం: శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం విజయవాడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

March 6, 2026 / 07:50 PM IST