ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘జెయింట్ రేజ్’ సైనిక చర్య అత్యంత ఖరీదైనదిగా మారుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ ఆపరేషన్, మొదటి 100 గంటల్లోనే సుమారు 3.71 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.31వేల కోట్లు) ఖర్చు అయిందట. ఈ మేరకు అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ అంచనా రిపోర్టు విడుదల చేసింది. మరోవైపు భారీగా ఆస్తినష్టం కూడా వాటిల్లిందని పేర్కొంది.