నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ములుమూడి కలుజుపై బ్రిడ్జికి ఈనెల 8న ఉదయం 9:00 గంటలకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేస్తారని తెలిపారు.