ATP: రాయదుర్గం పట్టణంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక శక్తులు, నేర కార్యకలాపాలను అడ్డుకునేందుకు పోలీసులు తీసుకునే చర్యలు గురించి విద్యార్థులకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల మెయింటెనెన్స్‌పై అవగాహన కల్పించారు.