• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కుమ్మెర బాధితులకు న్యాయం జరగాలి: మాజీ మంత్రి

NGKL: జిల్లా కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, రజక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ.. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

March 7, 2026 / 09:38 AM IST

విశాఖలో రిజిస్ట్రేషన్ ఆదాయం వివరాలు

VSP: జిల్లాలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి రూ.1,066.19 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలోని తొమ్మిది సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఈ ఆదాయం నమోదైంది. ఫిబ్రవరి వరకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.1,445.7 కోట్ల లక్ష్యంలో 73.75 శాతం సాధించారు. గత ఏడాది ఇదే కాలంలో రూ.949.77 కోట్లు మాత్రమే వచ్చిందాని అదికారులు తెలిపారు.

March 7, 2026 / 09:36 AM IST

కొండపాకలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన

KNR: వీణవంక మండలంలోని కొండపాకలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనులపండువగా జరిగింది. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రణవ్ పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

March 7, 2026 / 09:36 AM IST

గంజాయి కోసం యువకుల హంగామా

VKB: పరిగి పట్టణంలోని బాహార్పేట్‌లో బీహార్‌కు చెందిన యువకులు హంగామా సృష్టించారు. గంజాయి కోసం ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుల్లో ఒకరు గంజాయి తాగుతుండగా, మరో యువకుడు ఇవ్వాలని అడిగాడు. ఇవ్వలేదనే కారణంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది చివరకు పరస్పర దాడికి దారి తీసింది.

March 7, 2026 / 09:36 AM IST

నరసరావుపేటలో ఓపెన్ హౌస్ కార్యక్రమం

PLD: మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమాన్ని నరసరావుపేట జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. పోలీసులు విధుల్లో ఉపయోగించే ఆధునిక ఆయుధాలు, తుపాకి ప్రాక్టికల్‌ డెమో ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెల్ప్‌లైన్‌ నంబర్లు, స్వీయ రక్షణ పద్ధతులపై మెలకువలు వివరించారు.

March 7, 2026 / 09:36 AM IST

90 శాతం పూర్తయిన పనులు

TG: ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అతి కీలక ఎయిర్ కాంకోర్స్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. భద్రత వ్యవస్థ మాత్రం పనులు మొత్తం పూర్తయ్యాకే ప్రారంభం కానుంది.

March 7, 2026 / 09:36 AM IST

నిరుపయోగంగా చెత్త రిక్షాలు

NLG: చిట్యాల మండలంలోని గ్రామ పంచాయతీలకు మంజూరైన చెత్త సేకరణ రిక్షాలు అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డాయి. స్వచ్ఛభారత్ మిషన్ కింద వీటిని కేటాయించగా, నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల ఇవి మాయమవగా, మరికొన్ని చోట్ల ట్రాక్టర్ల రాకతో వీటిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రజాధనం వృథా అవుతున్న తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు.

March 7, 2026 / 09:35 AM IST

ప్రొద్దుటూరులో రేషన్ బియ్యం పట్టివేత..!

KDP: ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె సమీపంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారుల బృందం రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బద్వేల్ నుంచి జమ్మలమడుగుకు ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్ బృందం పట్టుకుని స్థానిక రెవెన్యూ పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సుమారు 120 బియ్యం బస్తాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

March 7, 2026 / 09:35 AM IST

‘రైస్ మిల్లర్లపై విధించిన పెనాల్టీలను ఎత్తి వేయాలి’

MLG: డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై విధించిన 25% ఫెనాల్టీ, 12% వడ్డీని వెంటనే ఎత్తివేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులకు కోట్ల రూపాయల పునరావాసం ఇస్తున్న ప్రభుత్వం.. రైస్ మిల్లర్లపై కనికరం చూపకపోవడం దారుణమని మండిపడ్డారు.

March 7, 2026 / 09:35 AM IST

విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

NRPT: మాగనూరు మండలంలోని అచ్చంపేట గ్రామంలో శుక్రవారం రాత్రి విద్యుత్ షాక్‌తో యువ రైతు చెందాడు. గ్రామానికి చెందిన దేవప్ప(32) తన వ్యవసాయ పొలంలో స్టార్టర్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి మరణించాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉదయం పొలం దగ్గరికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్‌తో చనిపోయినట్లు గుర్తించారు.

March 7, 2026 / 09:34 AM IST

ఉపాధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

ELR: జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు, బిల్లుల అప్లోడ్ ప్రక్రియను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి హామీ పథకం మారనున్న నేపథ్యంలో, పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు.

March 7, 2026 / 09:34 AM IST

సివిల్స్‌లో సత్తాచాటిన జిల్లా వాసి..!

KRNL: జిల్లా చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

March 7, 2026 / 09:31 AM IST

డ్రైనేజీ సమస్యపై కమిషనర్ తక్షణ చర్యలు

ATP: 31వ వార్డు మస్తాన్‌పేట ఏరియాలో నిలిచిపోయిన మురుగునీటి సమస్యను శనివారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను గమనించి, వెంటనే JCB ద్వారా పూడిక తీయించి డ్రైనేజీ సాఫీగా వెళ్లేలా చూడాలని వార్డు సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

March 7, 2026 / 09:30 AM IST

రాంపూర్ డంపింగ్ యార్డ్‌లో చెలరేగిన మంటలు

హనుమకొండ నగరంలోని రాంపూర్ డంప్ యార్డ్‌లో శుక్రవారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న బల్దియా డీఆర్ఎఫ్, శానిటేషన్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి మంటలను వేగంగా అదుపులోకి తీసుకున్నారు. వాటర్ ట్యాంకర్లు, సంప్‌ల ద్వారా నీటిని స్ప్రే చేసి, బయో ఎర్తింగ్ మెటీరియల్‌ను పొరలుగా మార్చి మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.

March 7, 2026 / 09:30 AM IST

పల్లంట్ల రహదారిలో చెత్త కుప్పలు

E.G: దేవరపల్లి-పల్లంట్ల రహదారి పారిశుద్ధ్య లోపంతో డంపింగ్‌ యార్డ్‌ను తలపిస్తోంది. సమీపంలోనే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం రాకపోకలు సాగించే దారిలో చెత్త పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

March 7, 2026 / 09:30 AM IST