ATP: అనంతపురంలోని షికారి కాలనీ, బుడ్డప్ప నగర్లలో SP జగదీష్ నేతృత్వంలో 100 మంది పోలీసులు భారీ సోదా నిర్వహించారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, దొంగతనాలు వంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.