ADB: ఉట్నూర్ ఐటీడీఏలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పీవీటీజీ ఏపీఓ పోస్టు ఎట్టకేలకు భర్తీ అయింది. ఈ పదవికి ఆత్రం భాస్కర్‌ను నియమిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలోనూ ఇదే పోస్టులో పనిచేసిన అనుభవం ఉండటంతో ప్రభుత్వం ఆయనకే మొగ్గు చూపింది. ఐటీడీఏ పీఓ సారథ్యంలో పీవీటీజీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.