• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో

KRNL: పెద్దకడబూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ప్రభావతి దేవి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులతో మాట్లాడారు. అనంతరం చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ నిబంధనలు మేరకు పౌష్టికాహారం సకాలంలో అందజేయాలని ఆదేశించారు. తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు.

March 7, 2026 / 12:20 PM IST

మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

MLG: జిల్లా చెరుపల్లి గ్రామానికి చెందిన కాటా రాణి అనుమానాస్పద మృతి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమె భర్త కాటా మహేశ్, సోదరుడు కాటా కాంతలను దోషులుగా నిర్ధారించి ఇద్దరికీ 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఇవాళ SP సుదీర్ రంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 7, 2026 / 12:20 PM IST

జాబ్ మేళాకు భారీగా తరలివచ్చిన యువత

KMR: దోమకొండలో కామారెడ్డి ఎంప్లాయిమెంట్ ఆఫీస్, డీఎంకే ఫోర్ట్ ట్రస్ట్, లైఫ్ ఎన్‌జీఓ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులతో ఇంటర్వ్యూలు నిర్వహించాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. బాబ్జీ జలాది, బాలప్రసాద్ దేవరగట్టు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 7, 2026 / 12:20 PM IST

‘తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

AKP: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఇవాళ సుందరయ్యపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి వాటర్ ట్యాంకులను పరిశీలించారు. వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు.

March 7, 2026 / 12:19 PM IST

పులివెందులకు కొత్త సీఐ..మార్పులొచ్చేనా..?

KDP: పులివెందుల సీఐగా నియమితులైన శ్రీరామ్ అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. ఆయన ప్రొద్దుటూరులో పని చేసినప్పుడు అక్కడి J రౌడీ, సస్పెక్ట్ షీటర్లందరినీ పిలిపించి బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ అడేవారికి తనదైన శైలిలో కోటింగ్ ఇచ్చారు. మద్యం దుకాణాలను రాత్రి 10 కల్లా మూయించినట్లు స్థానికులు తెలిపారు.

March 7, 2026 / 12:18 PM IST

‘పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలి’

MNCL: గ్రామ, ఇళ్ల పరిసరాల పరిశుభ్రతను పాటించాలని దండేపల్లి మండలంలోని కొరివిచెల్మ గ్రామ కార్యదర్శి జునైద్ మహమ్మద్ కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను పంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు ప్రబలవని పేర్కొన్నారు.

March 7, 2026 / 12:18 PM IST

జిల్లాలో కార్డన్ సెర్చ్ చేసిన పోలీసులు

అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, మత్తు పదార్థాల రహిత జిల్లా లక్ష్యంగా ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ పేరుతో పోలీసులు ఇవాళ  రాయచోటి, మదనపల్లె (అంగళ్ళు) ప్రాంతాల్లో భారీ ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. 10 ప్రత్యేక బృందాలు అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో సమస్యాత్మక ప్రాంతాలు, ఖాళీ భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.

March 7, 2026 / 12:17 PM IST

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎపీసీసీ చీఫ్

ELR: ఎపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి శనివారం ఏలూరు జిల్లా భీమడోలు పర్యటించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా భీమడోలు ప్రధాన సెంటర్లో ఆమె రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

March 7, 2026 / 12:17 PM IST

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శ

SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం కి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పోలంపల్లి రామకోటయ్య మృతి చెందడంతో, శనివారం ఆయన మృతదేహానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ​ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 12:15 PM IST

సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ గవర్నర్ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డితో డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ భేటీ అయ్యారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలపై ఈ సమావేశంలో సీఎంతో మాట్ మేయర్ చర్చించారు. డెలావర్ రాష్ట్రంలో అమలు చేసిన పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు, రుణమాఫీ ఇతర అంశాలను మ్యాట్ మేయర్ సీఎంకు వివరించారు. డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్‌పై చర్చించారు.

March 7, 2026 / 12:14 PM IST

ఆర్థిక సహాయం చేసిన ఉత్సవ కమిటీ ఛైర్మన్..!

ELR: నిడమర్రు మండలం పెద నిండ్రకొలను గ్రామానికి చెందిన గంధం రామకృష్ణ గుండెపోటుతో ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు భీమేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ ఛైర్మన్ మేకా వెంకటరమణ రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్నిశనివారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు.

March 7, 2026 / 12:13 PM IST

కడితోటలో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు

KRNL: ఆదోని మండల కడితోట గ్రామ బస్టాండ్ సమీపంలో ఇవాళ రూరల్ సీఐ నల్లప్ప,పెద్దతుంబలం ఎస్సై విద్యశ్రీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, వాహనానికి సంబంధించిన వ్యాలిడ్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 7, 2026 / 12:08 PM IST

ఈనెల 10న ఖాకీ కొలువుల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీ!

HYD: పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్‌సుఖ్‌నగర్‌లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు.

March 7, 2026 / 12:06 PM IST

సివిల్స్‌లో ప్రతిభ చాటిన గిరిజన బిడ్డ

BDK: ఇల్లందుకి చెందిన బానోతు లక్ష్మీ రచన ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆమె 178వ ర్యాంకు సాధించి మెరిశారు. బానోత్ వెంకటరమణ, తులసమ్మల కుమార్తె అయిన లక్ష్మి మూడుసార్లు ఇంటర్వూ వరకు వెళ్లి విఫలమయ్యారు. పట్టు వదలకుండా ఆత్మవిశ్వాసంతో చదివి నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

March 7, 2026 / 12:05 PM IST

గుడ్ న్యూస్.. జీతాలు పెంచిన ప్రభుత్వం

AP: జలవనరుల శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే లస్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.350గా ఉన్న రోజువారీ వేతనాన్ని రూ.550కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లస్కర్ల వినతి మేరకు వేతన పెంపు ప్రతిపాదనను ఆమోదించిన ప్రభుత్వం.. ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

March 7, 2026 / 12:04 PM IST