• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పది పరీక్షలకు 696 మంది విద్యార్థులు

నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈవో రాములు తెలిపారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల కోసం మండలంలో సిరికొండ, మోడల్ స్కూల్, వాల్గోట్, కొండాపూర్లలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

March 7, 2026 / 02:05 PM IST

పరీక్ష రాసి.. అదృశ్యమై విద్యార్థి మృతి

KMR: బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకాశం.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ముజాహిద్ శనివారం పెద్దదడిగి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువలో శవమై కనిపించాడు.

March 7, 2026 / 02:05 PM IST

కర్నూలులో ‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’

కర్నూలు పట్టణంలో శనివారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు పేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా నిర్వహించారు. శనివారం ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో 350 లీటర్ల బెల్లం ఊటను, 50 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు.

March 7, 2026 / 02:05 PM IST

VIDEO: యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

BHNG: శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 02:05 PM IST

వైఫై స్లోగా ఉందా? ఈ చిట్కాలు వాడండి!

వైఫై స్లోగా ఉంటే ఇబ్బంది పడకుండా ఈ చిన్న మార్పులు చేయండి. రౌటర్‌ను ఇంటి మధ్యలో, ఎత్తులో ఉంచడం వల్ల సిగ్నల్ బాగా అందుతుంది. అలాగే సెట్టింగ్స్‌లో 5GHz బ్యాండ్‌ను ఎంచుకోండి. మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాలకు రౌటర్ దూరంగా ఉండేలా చూడండి. ఈ చిట్కాలతో ఇంటర్నెట్ వేగం పెరిగి బఫరింగ్ సమస్యలు తగ్గుతాయి.

March 7, 2026 / 02:05 PM IST

‘స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు వినియోగించుకోవాలి’

KNR: ‘ప్రజా ప్రభుత్వం- ప్రగతి పాలన’లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలలో నిర్వహిస్తున్న స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ కుమార్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు ఒక పీహెచ్సీలో గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, ఆప్తోల్మాలజీ, జనరల్ మెడిసిన్, డెంటల్ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

March 7, 2026 / 02:04 PM IST

చీర్ల చందర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన శివసేన రెడ్డి

WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.

March 7, 2026 / 02:04 PM IST

చీర్ల చందర్ రాజీనామా పత్రాన్ని ఆమోదించిన జిల్లా అధ్యక్షుడు

WNP: ఇటీవల కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌తో గెలిచి, పార్టీ లైన్ తప్పిన మాజీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ రాజీనామా రాసిన పత్రాన్ని ఆమోదించామని, పార్టీకి ఆయనకు ఎలాంటి సంబంధం లేదని జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అన్నారు.

March 7, 2026 / 02:04 PM IST

ఏకులపోతమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మొద్దులగూడెం గ్రామ దేవత శ్రీ ఏకులపోతమ్మ తల్లి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సాదరంగా స్వాగతం తెలిపి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర ప్రజానీకం చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 02:03 PM IST

గ్రామంలో వేగంగా అభివృద్ధి పనులు

VKB: కొడంగల్ మండలం కస్తూర్ పల్లి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ శ్రీశైలం గౌడ్ తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 7, 2026 / 02:02 PM IST

నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

NDL: నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం కలిశారు. ఆయన కార్యాలయంలో నంది కొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల, ముచ్చుమర్రి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన వివరాలను మంత్రికి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 7, 2026 / 02:01 PM IST

ప్రొద్దుటూరులో విద్యార్థి మృతి.!

KDP: ప్రొద్దుటూరు నడింపల్లె మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విషాదం నెలకొంది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి పాఠశాలలో శనివారం ఫిట్స్ వచ్చింది. తల్లిదండ్రులకు టీచర్లు సమాచారం ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. టీచర్ల నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతి చెందినట్లు పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

March 7, 2026 / 02:01 PM IST

అనాథ కుటుంబానికి గ్రామస్తుల సహాయం

MBNR: మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ గ్రామానికి చెందిన ఎరుకలి ఎల్లప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియలకు ఇబ్బంది పడుతుండగా సర్పంచ్ మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ వెంకట్ రామిరెడ్డి చొరవ తీసుకున్నారు. దాతల సహకారంతో రూ.17,500 సేకరించి కుటుంబానికి అందజేశారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

March 7, 2026 / 02:01 PM IST

సాగునీటి సమస్యకు కృషి చేసిన ఎమ్మెల్యే

E.G: తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీరు విడుదల చేయాలని గోపాలపురం MLA వెంకటరాజును రైతులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే శనివారం తాడిపూడి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. దీంతో అధికారలు కాలువకు రెండు చోట్ల లీకేజీలు పూర్తి అయిన వెంటనే తాడిపూడి కెనాల్‌కు నీరు వదులుతామని వివరించారు. ఈ క్రమంలో సుమారు 7 ఎకరాలకు సాగునీరు అందుతుందని MLA వివరించారు.

March 7, 2026 / 02:00 PM IST

జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి: కుడా ఛైర్మన్

HNK: జిల్లాలోని అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. హనుమకొండ దిశ కమిటీ మీటింగ్‌లో ఛైర్మన్ మాట్లాడుతూ… పేదలకు అందాల్సిన రేషన్, పెన్షన్లు, విద్య, వైద్య సౌకర్యాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని, ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు చేయాలన్నారు.

March 7, 2026 / 02:00 PM IST