• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అభివృద్ధి పనులు పరిశీలించిన అధికారులు

SKLM: మెలియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామంలో ఇటీవల గ్రామ సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులను టెక్కలి DLPO రమణ, ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ శనివారం పరిశీలించారు. గ్రామస్తులు కలెక్టర్‌కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ చేసిన పాత అభివృద్ధి పనులను పరిశీలించడం జరుగుతుందన్నారు. పనుల వివరాలు కలెక్టర్‌కి నివేదిక అందజేస్తామన్నారు.

March 7, 2026 / 08:12 PM IST

60 కిలోల గంజాయి స్వాధీనం

AKP: పాయకరావుపేట మండలం సీతారాంపురం జంక్షన్ వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బవరం నుంచి బెంగళూరు తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించిందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ రాజేష్‌ను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.

March 7, 2026 / 08:11 PM IST

సింగరేణి సీఎండీను కలిసిన కలెక్టర్

BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ సింగరేణి ప్రధాన కార్యాలయంలో SCCL CMD డా. జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొన్నారు.

March 7, 2026 / 08:10 PM IST

గద్దర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం ఏర్పాట్లను విగ్రహ కమిటీ నాయకులు పరిశీలించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో పాటు కన్వీనర్ లక్ష్మణ శర్మ, సదానందం గౌడు, జంగయ్య, జూపల్లి రాములు, శేఖర్, వీరస్వామి, జగన్ తదితరులు ఏర్పాట్లు సమీక్షించారు.

March 7, 2026 / 08:10 PM IST

సోమందేపల్లిలో ముగ్గురికి జైలు శిక్ష

సత్యసాయి: సోమందేపల్లిలో సురేష్‌పై దాడికి యత్నించిన ముగ్గురికి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు SI రమేశ్ బాబు తెలిపారు. గుడిపల్లికి చెందిన సురేశ్ సోమందేపల్లిలో మొబైల్ దుకాణం నిర్వహించేవాడని తెలిపారు. సురేశ్ పై గతంలో కారంపొడి చల్లి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచగా కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది.

March 7, 2026 / 08:07 PM IST

కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సర్వం సిద్ధం

కృష్ణా: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సంబంధించి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులకు ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు త్వరలో నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశం దృష్ట్యా వివిధ శాఖల పనితీరుపై చర్చించారు.

March 7, 2026 / 08:07 PM IST

హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

SKLM: జిల్లా హోంగార్డు యూనిట్‌కి చెందిన హోంగార్డు పి.భాస్కరరావు విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు శనివారం జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు అందరు స్వచ్ఛందంగా అందించిన ఒక రోజు వేతనాన్ని రూ.4 లక్షలను ఆయన కుటుంబ సభ్యులకు అదనపు ఎస్పీ కేవీ రమణ తన కార్యాలయంలో అందజేశారు.

March 7, 2026 / 08:06 PM IST

షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

KMR: భిక్కనూర్ మండలం కాచాపూర్‌లో శనివారం విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో ఇళ్లు కాలిపోయింది. గ్రామానికి చెందిన వడ్ల శేఖర్ తన ఇంట్లో వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇంట్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు.

March 7, 2026 / 08:05 PM IST

రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు

CTR: సదుం మండలంలోని 79a చింతమాకులపల్లి పంచాయతీ పరిధిలో కారేవాండ్ల పల్లెలో నూతనంగా నిర్మించిన సీతారామ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం జరగనున్నట్టు ఆలయ ఛైర్మన్ మునినాథ తెలిపారు. ఉదయం సీతారామ, లక్ష్మణ పంచలోహ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం, సర్వదర్శనం జరుగుతుందన్నారు. 11 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు.

March 7, 2026 / 08:05 PM IST

ఉప సర్పంచుకు వాహనం అందజేసిన చిన్నారెడ్డి

WNP: వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు పెద్దగూడెం ఉపసర్పంచ్ భారతయ్యకు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుల వాహనం అందజేశారు. తాను దివ్యాంగుల వాహనం ఇప్పించాలని విన్నవించగా సంబంధిత అధికారి దివ్యాంగుల వెల్ఫేర్ ద్వారా వాహనం మంజూరు చేయించి అందించారు. నందిమల్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 08:04 PM IST

మగువోత్సవంలో మహిళల సత్కారం

VSP: బిందు సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ‘మగువోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు.

March 7, 2026 / 08:03 PM IST

‘దేశ భవిష్యత్తు నిర్మించే శక్తి యువతకు ఉంది’

MDK: దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమంలో “50 Years of Emergency- Lessons for Indian Democracy” అంశంపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

March 7, 2026 / 08:03 PM IST

‘సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి’

ADB: కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపే విధంగా సిలిండర్ ధరలను పెంచిందని, వెంటనే తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొట్నాక్ దేవిదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే సిలిండర్లను తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

March 7, 2026 / 08:03 PM IST

ఆస్తి పన్ను సకాలంలో వసూలు చేయాలి: కమిషనర్

NZB: ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఇతర శాఖల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

March 7, 2026 / 08:03 PM IST

ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

SDPT: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి.

March 7, 2026 / 08:02 PM IST