AKP: పాయకరావుపేట మండలం సీతారాంపురం జంక్షన్ వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బవరం నుంచి బెంగళూరు తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించిందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ రాజేష్‌ను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు.