BDK: చర్ల మేజర్ పంచాయతీ పరిధిలోని జయంతి కాలనీ శివారు తుర్రవాగు వద్ద శనివారం ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టుకు వెళ్లే దారి పక్కన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వద్ద సామగ్రి ఉన్న సంచి లభించగా అతడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా స్థానికులు అనుమానిస్తున్నారు.