RR: సుజాత ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ (SFI) చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సుజాత ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.