TG: హైదరాబాద్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆరు జోన్లలో ఫుట్‌పాత్‌లపై ఉన్న 798 ఆక్రమణలను తొలగించింది. పుట్‌పాత్‌లపై శాశ్వతంగా ఏర్పాటు చేసిన 340 దుకాణాలను, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 458 దుకాణాలను తీసేసింది. పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది.