SRPT: కోదాడ మున్సిపల్ పరిధిలోని ఉత్తమ్ పద్మావతి నగర్ అర్బన్ పార్కును శనివారం మున్సిపల్ ఛైర్మన్ కుసుమ పరిశీలించారు. పార్కు దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, వెంటనే పారిశుద్ధ్య పనులు ప్రారంభించాలని, నిర్వహణకు ఇద్దరు కార్మికులను కేటాయించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.