డెహ్రాదూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో 8వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువు రేపటితో ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. 2027 జనవరి నాటికి ఏడో తరగతి ఉత్తీర్ణులైన లేదా ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 02.01.2014 – 01.07.2015 మధ్య జన్మించి ఉండాలి.