BHNG: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆలేరు మున్సిపల్ 4వ వార్డు పరిధిలోని పలు అభివృద్ధి పనులను చైర్ పర్సన్ బీజని బాలమణి-భాస్కర్ పరిశీలించారు. పనులు త్వరితగతినా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.