ASF: ఆసిఫాబాద్లో ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6:30 గంటలకు కలెక్టరేట్లో యోగా, అవగాహన శిబిరం, 9:30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరంలో అన్ని వ్యాధులకు పరీక్షలు చేస్తామన్నారు.