ప్రకాశం: త్రిపురాంతకంలో సోమవారం ఒక్కసారిగా వాతావరణం మారి వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి పిడుగు పాటుకు గురై ఒక ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటనతో ఎద్దును పెంచుకున్న యజమాని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అకాల వర్షం నష్టం చేకూర్చింది. దీంతో త్రిపురాంతకంలో విషాదఛాయలు అలుముకున్నాయి.