MDCL: 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఇవాళ మల్కాజ్గిరి పరిధి సఫీల్ గూడ లేక్ వద్ద మిల్లెట్ ఫుడ్ కోర్ట్ ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి కింద ఈ కార్యక్రమం చేపట్టి, చెరువుల వద్ద జీవనోపాధి అవకాశాలను పెంచుతూ స్వయం సహాయక మహిళలకు ఆదాయం కల్పించే దిశగా అడుగువేస్తున్నట్లు తెలిపారు.