GDWL: జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే కృష్ణవేణి చౌక్ వద్ద శ్రీ జోగులాంబ న్యూరో & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం అద్భుతమైన సామాజిక బాధ్యతను చాటుకుంది. శనివారం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనాలు ఆగే నాలుగు వైపులా భారీ గ్రీన్ మ్యాట్ చేయించారు. దీనివల్ల సిగ్నల్ పడగానే ప్రయాణికులకు కొంత ఊరట కలుగుతుంది.