SKLM: జిల్లా హోంగార్డు యూనిట్కి చెందిన హోంగార్డు పి.భాస్కరరావు విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు శనివారం జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు అందరు స్వచ్ఛందంగా అందించిన ఒక రోజు వేతనాన్ని రూ.4 లక్షలను ఆయన కుటుంబ సభ్యులకు అదనపు ఎస్పీ కేవీ రమణ తన కార్యాలయంలో అందజేశారు.