భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు దూసుకెళ్లాడు. ఇవాళ సెమీఫైనల్లో కెనడాకు చెందిన విక్టర్ లైపై లక్ష్యసేన్ 21-16, 18-21, 21-15 స్కోరుతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. రేపు జరిగే ఫైనల్లో తైవాన్ ఆటగాడు లిన్ చున్-యితో లక్ష్య సేన్ తలపడనున్నాడు.