TG: 1904లో విజయ డెయిరీ ఏర్పాటు చేశామని TG DDF ఛైర్మన్ అమిత్ రెడ్డి గుర్తు చేశారు. విభజన తర్వాత విజయ డెయిరీ రెండుగా విడిపోయిందన్నారు. గత YCP హయాంలో విజయ డెయిరీ పేరుతో గుజరాత్ సంస్థ మేఘన ఫుడ్స్‌కు నెయ్యి ఫ్రాంచైజీ ఇచ్చారని చెప్పారు. ఆ నెయ్యి పూర్తిగా కల్తీ అని నివేదికలు వచ్చాయని వెల్లడించారు. విజయ డెయిరీ పేరుతో నకిలీ విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.