TG: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. షెడ్యూల్ ప్రకారం మ. 2 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానానికి ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమాన సర్వీసును రద్దు చేసి, ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.