సత్యసాయి: సోమందేపల్లిలో సురేష్‌పై దాడికి యత్నించిన ముగ్గురికి కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు SI రమేశ్ బాబు తెలిపారు. గుడిపల్లికి చెందిన సురేశ్ సోమందేపల్లిలో మొబైల్ దుకాణం నిర్వహించేవాడని తెలిపారు. సురేశ్ పై గతంలో కారంపొడి చల్లి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచగా కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది.