కర్నూలు పట్టణంలో శనివారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ రవికృష్ణ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆపరేషన్ వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు పేటలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా నిర్వహించారు. శనివారం ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో 350 లీటర్ల బెల్లం ఊటను, 50 లీటర్ల నాటుసారాను గుర్తించి ధ్వంసం చేశారు.