SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం కి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పోలంపల్లి రామకోటయ్య మృతి చెందడంతో, శనివారం ఆయన మృతదేహానికి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.