హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో రామ్ చరణ్ గాయపడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంటి దగ్గర స్వల్ప గాయమైనట్లు.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోస్టులు షేర్ చేస్తున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో పెద్ది టీజర్ విడుదల చేస్తారని సమాచారం.