AP: మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన అవసరముందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. రైల్వే, పోలీస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్స్, చిన్నారుల సంరక్షణ కమిటీలను భాగస్వాములను చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు. దీనికి సంబంధించి 112 టోల్ ఫ్రీ నంబర్, శక్తి యాప్‌లపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు.