NLG: రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై మరోసారి చర్చ మొదలైంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే గతంలో రద్దయిన పాత నియోజకవర్గాల పేర్లు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. రామన్నపేట, నాగారం ప్రాంతాలను తిరిగి నియోజకవర్గ కేంద్రాలుగా మార్చే అవకాశం ఉందనే వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.