కృష్ణా: తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని పోరంకి సర్కిల్ మూడవ సచివాలయంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మిల్లెట్స్‌తో చాక్లెట్లు తయారు చేస్తున్న దంపతులకు ప్రోత్సాహంగా, స్థానిక స్వీట్, బేకరీ దుకాణాల్లో వాటిని విక్రయించాలని యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.