KDP: ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆలయంలో పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనితో కళ్యాణ ఘట్టానికి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయంలో పసుపును దంచుతారు.