AP: అమరావతిలో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వర్షాలతో చిత్తడిగా ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగడంపై అనుమానాలను బలపరుస్తోంది. దీంతో కుట్రకోణంపై దర్యాప్తు సాగుతోంది. ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటెలిజెన్స్ ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి అన్నివర్గాలతో చర్చించి వివరాలు సేకరించారు.