MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో వ్యాపారులు యజమానులు ఆస్తిపన్నులు చెల్లించి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి కోరారు. కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించి ఆస్తి పన్ను కట్టని పలు వ్యాపార సముదాయాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ హేమలత తదితరులు పాల్గొన్నారు.