అనంతపురం జిల్లాలో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి పది రోజులు గడుస్తున్నా డెలివరీ కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతను తీర్చి, సరఫరాను క్రమబద్ధీకరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. మరోవైపు హోటల్లో కట్టెల పొయ్యి వినియోగిస్తున్నారు.