BDK: బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో ఉండదని అన్నారు. మండల కేంద్రంతో పాటు సంజీవరెడ్డి పాలెం పరిసర ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు. వినియోగదారులు వారికి సహకరించాలని కోరారు.