TG: ఎండలు తీవ్రమవుతున్న వేళ TGSRTC బస్సుల్లో ‘జీవా’ నీళ్ల బాటిళ్ల సరఫరా నిలిచిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా బాటిళ్ల తయారీకి అవసరమైన ముడిపదార్థాల కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే సరఫరా లేకపోయినా సూపర్ లగ్జరీ, రాజధాని తదితర బస్సుల్లో టికెట్ ఛార్జీలో రూ.10 వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.