VZM: శ్రీ రామనారాయణంలో ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరామనవమి వేడుకల ఉత్సవ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాణక్య, శ్రీనివాసరాజు, పీఆర్వో రమణ పాల్గొన్నారు.