AP: బెల్ట్ షాపులపై సోషల్ మీడియాలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు పోస్ట్ చేశారు. ‘తిరువూరు నియోజకవర్గంలో.. విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారు. అధిక రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. లిక్కర్ సిండికేట్‌తో అధికారులు కుమ్మక్కయ్యారు. సీఎం ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. బెల్ట్ షాపులను వెంటనే తొలగించాలి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.