KMM: మధిర రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఇవాళ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి కావాల్సిన పసుపును మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో దంచుతూ స్వామివారి సేవలో నిమగ్నమయ్యారు. ఆలయ పరిసరాలు భక్తుల రామనామ స్మరణతో మారుమోగాయి. వేడుకలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది