NDL: జూపాడు బంగ్లా మండలం బన్నూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం జరిగింది. కర్నూలు నుంచి శివపురం వైపు వెళ్తున్న బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో శేఖర్, అనసూయ, వారి కుమారుడు మహేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.