ATP: రాయదుర్గం పట్టణం కొండపై వెలసిన శ్రీరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు కళ్యాణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఓ వైపు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు పూర్తి అయిన నేపథ్యంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున కొండపైకి ఎక్కి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.