కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్రోల్ బంకులు, మాల్స్, మార్కెట్లలో మద్యం విక్రయించనున్నారు. అయితే ఏడాదికి రూ.3 కోట్ల కంటే ఎక్కువ GST టర్నోవర్ ఉన్న డిపార్ట్మెంటల్ స్టోర్లు, పెట్రోల్ బంకులకే ఇందుకు అనుమతి ఇస్తారు. మద్యం విక్రయ కేంద్రాల పనివేళలనూ ప్రభుత్వం అర్ధరాత్రి వరకు పొడిగించింది.