KNR: మహిళా పోలీసుల్లో నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కరీంనగర్లో పోలీస్ ఆధ్వర్యంలో ‘షీ లీడ్స్-2026’ సదస్సు ఘనంగా నిర్వహించారు. సీపీ గౌష్ ఆలం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సమాజ రక్షణలో మహిళల పాత్రను కొనియాడారు. సదస్సులో మనోధైర్యం, యోగా, విధి నిర్వహణపై నిపుణులు అవగాహన కల్పించారు. అనంతరం సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.