AP: నంద్యాల జిల్లా చాబోలు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సు టైరు పేలి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని పలువురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.